'కుటుంబ పోషణ కష్టంగా ఉంది': బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్ చేయాలని కోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు ఖాతాలో ఫ్రీజ్ చేయబడిన రూ. 3 కోట్లను అన్ ఫ్రీజ్ చేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం తన కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతోందని, వెంటనే తమ బ్యాంకు ఖాతాలను అన్ ఫ్రీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.