అమెరికాలో విమానాలు తయారు చేయాలని ట్రంప్ హెచ్చరిక!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

అమెరికా మార్కెట్లోకి ప్రవేశించాలంటే విమానాలను అక్కడే తయారు చేయాలని కెనడా ఏరోస్పేస్ సంస్థ బాంబార్డియర్‌ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను పిగ్గీబ్యాంక్‌లా చూడటం ఆపాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన బాంబార్డియర్ సంస్థ ఇప్పటికే అమెరికాలో బలమైన ఉనికిని కలిగి ఉందని, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నామని స్పష్టం చేసింది.