దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ప్రత్యక్షమైన అజిత్ అగార్కర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
బీసీసీఐ కీలక సమీక్షా సమావేశానికి గైర్హాజరై ఊహాగానాలకు తావిచ్చిన టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెన్నైలోని దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యక్షమయ్యారు. సౌత్, ఈస్ట్ జోన్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌ను స్టాండ్స్‌లో కూర్చుని వీక్షించారు. త్వరలో జరగనున్న ఇండియా 'ఎ' జట్టు సిరీస్‌ల కోసం ఆటగాళ్ల ప్రదర్శనను ఆయన పరిశీలిస్తున్నారు.