బంట్వారంలో క్రికెట్ టోర్నీ విజేతలకు ట్రోఫీలను అందించిన సర్పంచ్ మల్లేశం
రిపోర్టర్: SARA ASHOK
స్థలం: బంట్వారం
శారీరిక దృఢత్వానికి మరియు మానసికోల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని బంట్వారం గ్రామ సర్పంచ్ మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్ రైజింగ్ 11 జట్టుకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.