దీపం ఆకారంలో అమరి పర్యావరణహిత సందేశమిచ్చిన త్రివేణి విద్యార్థులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాలలో దీపావళి ముందస్తు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ దీపం ఆకారంలో నిలబడి అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని ప్రజలకు చక్కటి సందేశమిచ్చారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులను అభినందించారు.