తెలంగాణ విమోచన చరిత్రను చాటిన నారాయణ పాఠశాల వేడుకలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని నారాయణ హైస్కూల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నవనీత మాట్లాడుతూ.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందలేదన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబరు 13న ఆపరేషన్ పోలో ప్రారంభమై, సెప్టెంబరు 17న నిజాం సైన్యం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఏవో బాతరాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.