దగ్గులూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: నేరుగా ఇళ్లకు వెళ్లి అందించిన మంత్రి నిమ్మల

రిపోర్టర్: వెంకట్ స్థలం: పశ్చిమ గోదావరి

కూటమి ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తుందని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛను సొమ్మును అందజేశారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు సకాలంలో అందుతాయని, ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు.