యువత పాత్రతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమన్న ప్రధాని మోదీ

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోందని, ఇందులో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన ఇరవైవ రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన, యాభై ఒక్క వేలకు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు నూతన కెరీర్ అవకాశాలను తెరుస్తున్నాయని తెలిపారు.