రామాయణం సినిమా నుంచి జతగూడె పాట విడుదల: సీతారాముల కల్యాణ వైభోగం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
రణబీర్ కపూర్ మరియు సాయిపల్లవి జంటగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం రామాయణం నుంచి జతగూడె పాటను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మించగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. సీతారాముల దివ్య వివాహ వేడుకను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ గీతం ప్రస్తుతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.