కృత్రిమ మేధ అభివృద్ధిపై కఠిన నిబంధనలు కావాలని జైశంకర్ పిలుపు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
కృత్రిమ మేధ అభివృద్ధిలో కఠినమైన నిబంధనలు, రక్షణ గోడలు అత్యంత అవసరమని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ సంపాదకుడు జాన్ మిక్లెత్వైట్తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోజువారీ జీవితాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, భవిష్యత్తులో ప్రజాస్వామ్య ప్రక్రియల విశ్వసనీయతను ఇది దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.