అంతర్జాతీయ ఇంగ్లీష్ ఆల్బమ్ పై హిమేష్ రేశిమియా సంచలన ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

అంతర్జాతీయంగా ఇంగ్లీష్ భాషలో పదిహేను పాటలను తాను స్వయంగా స్వరపరిచి, రాసి, ఆలపించినట్లు ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేష్ రేశిమియా వెల్లడించారు. త్వరలోనే ఈ సరికొత్త సంగీత ఆల్బమ్ ను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్లూమ్బెర్గ్ ప్రపంచ టాప్ పాప్ స్టార్ల జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.