భారత్‌లో ఐఫోన్ల ధరలకు భారీ షాక్ ఇచ్చిన ఆపిల్

రిపోర్టర్: గోపి స్థలం: India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ భారతీయ మార్కెట్లో ఐఫోన్ల ధరలను విపరీతంగా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 10 శాతం మేర ధరలు పెరగగా, భారత్‌లో మాత్రం దిగుమతి సుంకాలు, ఉత్పత్తి వ్యయం కారణంగా ఈ పెంపు ఏకంగా 20 నుంచి 30 శాతం వరకు ఉంది. అమెరికాతో పోలిస్తే ఐఫోన్ ప్రో మోడళ్లపై కొనుగోలుదారులకు రూ. 50 వేల వరకు అదనపు భారం పడుతోంది.