భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ విశ్వాసం పెరుగుతోంది: మోదీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
భారత ఆర్థిక వృద్ధి, స్థిరత్వంపై అంతర్జాతీయంగా నమ్మకం మరింత పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడిన ఆయన, దేశ సంస్కరణలపై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోందన్నారు. జపాన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారత్ సార్వభౌమ రేటింగ్‌ను పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఫిన్‌టెక్ రంగంలో దేశం సాధిస్తున్న పురోగతిని కొనియాడారు.