ఐపీఎల్ ట్రేడ్ డీల్: చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య నలుగురు ప్లేయర్లు మార్పు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలకమైన ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్ లో భాగంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్, ఆస్ట్రేలియా బౌలర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టుతో చేరనుండగా, పేసర్ ఖలీల్ అహ్మద్, మరో బౌలర్ నాథన్ ఎల్లిస్ హైదరాబాద్ జట్టులోకి మారనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.