జూరాల నీటి విడుదల కోసం బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: జోగులాంబ గద్వాల
జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గద్వాల నియోజకవర్గ ఇంచార్జి హనుమంతు నాయుడు, బీఆర్ఎస్వీ నాయకుడు కురువ పల్లయ్యలను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అరెస్టులు చేసినా రైతుల కోసం పోరాటం ఆపబోమని హెచ్చరించారు.