'కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది': రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణుల ఘాటు విమర్శలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
కోటి ఎకరాల 22ఏ నిషేధిత జాబితా అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చివరకు అఫిడవిట్‌తో బోల్తా పడిందని బీఆర్ఎస్ వర్గాలు మండిపడ్డాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది ఈ సర్కార్ తీరు అని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులుగా కేసీఆర్‌కు వందల, వేల ఎకరాల భూములున్నాయని తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, చివరికి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే కేసీఆర్ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి కేవలం 67 ఎకరాలేనని తేల్చిచెప్పిందని విమర్శించారు.