విశాఖపట్నంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఎయిర్‌పోర్ట్ క్రైమ్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాజస్థాన్‌కు చెందిన ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్‌తో పాటు దొంగిలించిన బంగారాన్ని విక్రయించడంలో సహకరించిన మండ్రు లతా రత్నాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి నెట్టినట్లు ఎయిర్‌పోర్ట్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.