ఆమనగల్ పట్టణంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటన వివరాలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మార్కెట్ కమిటీ సమీపంలో గణేష్ పూజల్లో పాల్గొని అన్నదానం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంగళపల్లి రాములమ్మ దశదిన కర్మలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.