రాజకీయాలకు స్వస్తి పలికిన ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల నుంచి పోటీకి దూరంగా ఉంటూ, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన పదవీకాలంలో మిగిలిన మూడేళ్లు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.