పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం 2029 లక్ష్యంగా సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నారు. శాశ్వత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పాటు 32 ప్రభుత్వ శాఖలకు సమీకృత కార్యాలయ భవనాల ఏర్పాటు పనులు వేగవంతం చేశారు. పరిపాలనా మౌలిక వసతుల కల్పనతో పాటు ఎస్సీ వర్గాలకు మెరుగైన వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.