ఎన్టీఆర్ జిల్లాలో కల్యాణి హత్య కేసులో నిందితుల అరెస్ట్
రిపోర్టర్: శివ
స్థలం: ఇబ్రహీంపట్నం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్యాణి హత్య కేసు మిస్టరీ వీడినట్లు పోలీసులు వెల్లడించారు. డబ్బుల కోసం వేధిస్తోందనే కోపంతో నిందితుడు షఫీ తన మటన్ దుకాణంలోని కత్తితో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సహాయకుడు అబ్దుల్లాతో కలిసి మృతదేహాన్ని పది ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో వేసి వీటీపీఎస్ కాలవలో పడేసినట్లు తెలిపారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతురాలిని కల్యాణిగా గుర్తించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.