వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఎంబీఏ విద్యార్థికి టోకరా వేసిన సైబర్ కేటుగాడు అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మహారాష్ట్ర
ముంబైలో వెబ్ సిరీస్ చూసి స్ఫూర్తి పొందిన గురుగ్రామ్‌కు చెందిన అలోక్ కే అనే 24 ఏళ్ల యువకుడు, ఎంబీఏ విద్యార్థిని మోసం చేశాడు. విద్యార్థి కౌన్సెలర్‌గా నటించి, పరీక్షలలో కాపీయింగ్ కేసు పేరుతో భయపెట్టి రూ. 24.6 లక్షలు వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాంగుర్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.