సబ్బులు షాంపూలపై శాఖాహార మాంసాహార గుర్తులు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం

రిపోర్టర్: సునీల్ స్థలం: India

భారతదేశంలో విక్రయించే సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్‌లు మరియు ఇతర సౌందర్య సాధనాలపై ఇకపై శాఖాహార లేదా మాంసాహార మూలాలను తెలిపేలా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు గుర్తులను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం ఈ లేబుల్స్ ఉత్పత్తులపై స్పష్టంగా కనిపించేలా అమర్చాలని స్పష్టం చేసింది.