కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ నీటి పారుదల అంశాలపై చర్చించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పురోగతికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నూతన జల వనరుల అభివృద్ధి, మంచినీటి పథకాలకు సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీలు వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక జల వివాదాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.