విమాన ప్రయాణికులకు భారీ ఊరట: అంతర్జాతీయ సర్వీసులకు డిజి యాత్ర సేవలు
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం డిజి యాత్ర సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని ఏడు కీలక అంతర్జాతీయ విమానాశ్రయాల్ లో ఈ ట్రయల్స్ లాంఛనంగా ప్రారంభమయ్యాయి. చెల్లుబాటు అయ్యే ఈ-పాస్ పోర్ట్ కలిగిన భారతీయ పౌరులు ఈ డిజిటల్ ప్రవేశ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అర్హులుగా అధికారులు తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా ప్రయాణికుల సమయం భారీగా ఆదా అవ్వడంతో పాటు చెకిన్ ప్రక్రియ సులభతరం కానుంది.