అమెరికాలో ఇసాయిస్ తుఫాను భీభత్సం: తెలుగు వారికి సాయం అందించేందుకు ఏటా బృందం

రిపోర్టర్: సతీష్ స్థలం: USA

అమెరికాలో ఇసాయిస్ తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోందని, బాధితులను ఆదుకునేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని నిర్వాహకులు తెలిపారు. ఫ్లోరిడా, అలబామా తీరాలను తాకుతున్న ఈ తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు ప్రజలు అత్యవసర సహాయం కోసం ప్రకటించిన ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.