అనంతపురంలో కరవు కలకలం: రూ.1,420 కోట్ల ఆర్థిక సాయం కోరిన వ్యవసాయ శాఖ

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనంతపురం

ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున రూ.1,420.26 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ కోరారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరవు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్ గోట్మారే నేతృత్వంలో అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి కరవు పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.