ఈడీ ఉచ్చులో ఫీట్జీ: సంస్థ డైరెక్టర్లపై మనీలాండరింగ్ కేసు నమోదు
రిపోర్టర్: హరి
స్థలం: Ghaziabad
విద్యార్థుల నుంచి ముందస్తుగా వసూలు చేసిన ఫీజులను స్వాహా చేశారన్న ఆరోపణలపై ఫీట్జీ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లు దినేష్ కుమార్ గోయల్, మోనిలా గోయల్‌లపై ఘజియాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అకారణంగా కోచింగ్ కేంద్రాలను మూసివేసి నిధులను దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని, సుమారు డెబ్బై కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.