దండగన్నారాలకు అభివృద్ధితో సమాధానం ఇచ్చిన పట్టసీమ ప్రాజెక్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీ సత్యసాయి

పట్టసీమ ప్రాజెక్ట్ దండగ కాదని, రాయలసీమకు వరం అని నిరూపించినట్లు పరిటాల శ్రీరామ్ - ధర్మవరం టీడీపీ సమన్వయకర్త వెల్లడించారు. రూ.1,651 కోట్ల పెట్టుబడితో రూ.1 లక్ష కోట్ల సంపద సృష్టించామని, వ్యవసాయం ద్వారా రూ.26,775 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందని ఆయన తెలిపారు. 12 ఏళ్లలో కృష్ణా బేసిన్కు 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు తరలించి, ఆక్వా రంగంలో రూ.78 వేల కోట్ల సంపద సృష్టితో రాయలసీమలో సాగునీటి జలకళ సంతరించుకుందని స్పష్టం చేశారు.