నాగార్జున కింగ్ చిత్రంలో టబు పాత్ర: మహంతి ఝాన్సీ రాణిగా లుక్ విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగార్జున వందో సినిమా కింగ్ చిత్రంలో నటి టబు పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ గ్లింప్స్ విడుదల చేసిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ఆమె మహంతి ఝాన్సీ రాణి అనే శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నట్లు వెల్లడించారు. అదృష్టాన్ని నమ్మని, హుందా అయిన ఈ పాత్రలో టబు కనిపించనుండగా, దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత నాగార్జునతో ఆమె కలిసి నటిస్తుండటం విశేషమని చిత్ర బృందం పేర్కొంది.