ఆసియా క్రీడల ఫైనల్ లో శ్రీలంకతో తలపడుతున్న భారత మహిళల జట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: భారత్

ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఫైనల్ పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ ఫైనల్ పునరావృతమైన ఈ మ్యాచ్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించి తొలి స్వర్ణ పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీలంక జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.