గూగుల్ ప్లే కన్సోల్‌లో వివో వై600కే టర్బో స్మార్ట్‌ఫోన్ ప్రత్యక్షం

రిపోర్టర్: సునీల్ స్థలం: చైనా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివోకు చెందిన కొత్త మోడల్ వివో వై600కే టర్బో త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఫోన్ వి2553ఏ మోడల్ నంబర్‌తో గూగుల్ ప్లే కన్సోల్ జాబితాలో ప్రత్యక్షమైంది. ఇది గతంలో చైనాలో విడుదలైన వివో వై600 టర్బోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.