ఉపాధి క్షేత్ర సహాయకుల ఆందోళన: తాడేపల్లిలో ఐదు గంటల పాటు బైఠాయింపు

రిపోర్టర్: నరేష్ స్థలం: తాడేపల్లి

ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన సిబ్బంది బైపాస్ రోడ్డు సర్వీసు మార్గంలో బైఠాయించి నిరసన తెలిపారని జేఏసీ కన్వీనర్ కే ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సర్వీసు ఆధారంగా ఉద్యోగోన్నతులు కల్పించాలని, మరణించిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.