అమెజాన్ ప్రైమ్‌లో అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' స్ట్రీమింగ్!

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

అల్లరి నరేష్ కథానాయకుడిగా చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంభ ఊర్వశి మేనక' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. సినిమా విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.