తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసులో ఈడీ అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: Tirupati

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని రఫైండ్ పామాయిల్ మరియు రసాయనాలతో కల్తీ చేశారన్న ఆరోపణలపై సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది.