సూపర్ స్పెషాలిటీ సీట్ల భర్తీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: India
నీట్-ఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న వేలాది సీట్ల భర్తీకి అర్హత శాతాన్ని తగ్గించే అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, ఈ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.