దిల్లీలో కూలిన ఐదు అంతస్తుల భవనం, ఏడుగురు మృతి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
దిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల పీజీ భవనం కూలిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మందిని రక్షించారు. సహాయక చర్యలు ముగిశాయి. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన యజమానులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.