వైద్య విద్యలో సంచలనం: వంద కోట్ల విరాళంతో కొత్త మెడికల్ స్కూల్
రిపోర్టర్: హరి
స్థలం: San Francisco
శాన్ ఫ్రాన్సికో బే ఏరియాలో సరికొత్త వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఎన్విడియా బోర్డు మెంబర్ మార్క్ స్టీవెన్స్, మేరీ స్టీవెన్స్ దంపతులు రూ.1,750 కోట్ల భారీ విరాళం ప్రకటించినట్లు సటర్ హెల్త్ మరియు శాంటా క్లారా యూనివర్సిటీ సంయుక్తంగా వెల్లడించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వైద్య విద్యను అందించే ఈ ప్రత్యేక సంస్థ భవిష్యత్తు వైద్యులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తుందని, కాలిఫోర్నియా చరిత్రలో ఇది రికార్డు సృష్టించిందని నిర్వాహకులు తెలిపారు.