హెల్మెట్ ధరించిన బైక్ రైడర్లను అభినందించిన ఎస్పీ ఉమామహేశ్వర్

రిపోర్టర్: నరేష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు చెరుకుపల్లి మండలం కనగాల సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులను స్వయంగా వాహనం దిగి అభినందించినట్లు బాపట్ల పోలీసులు వెల్లడించారు. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ విధిగా హెల్మెట్ ధరించడాన్ని గుర్తించి వారిని ప్రశంసించారని తెలిపారు. ఈ ఆసక్తికర ఘటన రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే దిశగా సాగిందని, నిబంధనలు పాటించే వారిని ప్రోత్సహించడంలో పోలీసు యంత్రాంగం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.