అచ్యుతాపురంలో రూ.77 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బాపట్ల
అచ్యుతాపురంలో డెబ్బై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించిన రెండు వందల ఇరవై కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించినట్లు విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రంలో మరో మూడు సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.