క్లౌడ్ ఆధారిత ఏఐ అసిస్టెంట్ డాట్స్ ను ప్రారంభించిన ఓపెన్ ఏఐ
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh / Telangana
ఓపెన్ ఏఐ సంస్థ డెవ్ డే సందర్భంగా డాట్స్ పేరుతో నూతన ఏఐ అసిస్టెంట్లను ప్రారంభించినట్లు టెక్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ఈ క్లౌడ్ ఆధారిత ఏఐ అసిస్టెంట్ నిత్యం యూజర్ల తరఫున పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. చాట్ జీపీటీలో లేనప్పుడు కూడా ఇది సొంతంగా వెబ్సైట్లు తెరుస్తుందని, నాలుగు వేలకు పైగా యాప్స్‌తో అనుసంధానమై పనులు చేస్తుందని అభిషేక్ యాదవ్ తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఈ సరికొత్త టెక్నాలజీ ఫీచర్ టెక్ రంగంలో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.