సింగారంలో అక్రమ బెల్ట్ షాపులపై కలెక్టర్కు సర్పంచ్ గళమెత్తి ఫిర్యాదు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం సింగారం గ్రామంలో పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్పంచ్, వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల హెచ్చరికలను లెక్కచేయకుండా దొంగచాటుగా విక్రయాలు సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.