ప్రధాని మోదీ తండ్రిపై ఖర్గే వ్యాఖ్యల కలకలం: క్షమాపణలకు బీజేపీ డిమాండ్
రిపోర్టర్: సురేష్
స్థలం: పట్నా
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. బిహార్ రాజధాని పట్నాలో జరిగిన కార్యక్రమంలో సభికుల వ్యాఖ్యలపై స్పందిస్తూ ఖర్గే ఘాటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీకి, దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఖర్గేను డిమాండ్ చేశారు.