గుంకలం గ్రామంలో వినాయక వేడుకల్లో భాగంగా ఘనంగా అన్నసంతర్పణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

విజయనగరం మండల పరిధిలోని గుంకలం గ్రామం ఓల్డ్ బీసీ కాలనీలో పెద్ద వినాయక విగ్రహం వద్ద అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమ నిర్వాహకులు గణేష్, ఆకాశ్, వెంకటేష్ తో పాటు కమిటీ సభ్యులు భక్తుల సందడిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పెద్ద వినాయక దీవెనలు గుంకలాం ప్రజలు అందరికీ ఉండాలని కోరారు.