జూరాల ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్తత స్వయంగా నీరు వదులుకున్న రైతులు

రిపోర్టర్: విజయ్ స్థలం: వనపర్తి జిల్లా

వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని నిలిపివేయడంతో ఆగ్రహించిన ఆయకట్టు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్వయంగా రెగ్యులేటర్ పైకి ఎక్కి ప్రాజెక్ట్ నుండి సాగునీటిని విడుదల చేసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.