వృద్ధుల సంరక్షణ కేంద్రంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ
రిపోర్టర్: సునీల్
స్థలం: Thane
థానేలోని వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఉంటున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అక్కడ తనకు ఎంతో ఆదరణ లభిస్తోందని, ఇల్లు విడిచి వెళ్లిన భావన కలగడం లేదని వినోద్ కాంబ్లీ వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆ కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, పరిశుభ్రత చాలా బాగున్నాయని తెలిపారు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.