రేపు ఘనంగా నిర్వహించనున్న ఐఎఫ్డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఐఎఫ్డబ్ల్యూజే 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రేపు నిర్వహించనున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నానాబాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అరవపల్లి నగేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు అన్నం ఫౌండేషన్లో పండ్ల పంపిణీ, కేక్ కటింగ్, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జర్నలిస్టులు, ఫెడరేషన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.