తిరుమల శ్రీవారి డిసెంబర్‌ ఆర్జిత సేవల టికెట్ల విడుదల తేదీలు ఖరారు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి డిసెంబర్‌ నెల ఆర్జిత సేవల కోటాను ఈ నెల 19న తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన సేవల ఎలక్ట్రానిక్‌ డిప్‌ రిజిస్ట్రేషన్‌ కోసం 21వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా 24న విడుదల కానుంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది.