ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటమే నిజమని తేలిందంటూ సీతక్క వ్యాఖ్య
రిపోర్టర్: అశోక్
స్థలం: ములుగు
ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల ప్రధాన బలం అని, దానిని దొంగిలించడం అంటే ప్రజలను మోసగించడమే అని దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే వెల్లడించారు. గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీపై నిరంతరం పోరాటం చేస్తున్నారని ఆమె తెలిపారు. నేడు ఎన్నికల సంఘమే ఆ సత్యాన్ని బయటపెడుతోందని పేర్కొంటూ, జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.