కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సెర్ప్ ఊరటనిచ్చింది. ధ్రువీకరణ పత్రాలు ఆలస్యమైనా, వాటితో సంబంధం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, అధికారుల వెరిఫికేషన్ సమయంలో పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని, అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.